'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా' | Was awestruck hearing Mahesh Babu speak Tamil, says Harish Uthaman | Sakshi
Sakshi News home page

'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా'

Published Mon, Jul 13 2015 12:56 PM | Last Updated on Thu, Jul 25 2019 5:39 PM

'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా' - Sakshi

'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా'

చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు తమిళంలో మాట్లాడుతుంటే విస్మయంతో చూస్తుండిపోయానని నటుడు హరీశ్ ఉత్తమన్ వెల్లడించారు. 'శ్రీమంతుడు' సినిమాలో హరీశ్ విలన్ గా నటించాడు.

'మొదటిరోజు మా మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. షాట్ ముగిసిన తర్వాత మానిటర్ దగ్గర కూర్చున్న మహేశ్ పక్కన కూర్చున్నా. సడన్ గా ఆయన తమిళంలో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను' అని హరీశ్ పేర్కొన్నాడు. 'మీకు తమిళం ఎలా తెలుసు అని మహేశ్ ను అడగ్గా... తాను చెన్నైలోచదువుకున్నానని ఆయన సమాధానమిచ్చారని చెప్పాడు.

మహేశ్ స్నేహశీలిని ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో భాషాపరమైన సమస్యలు అధిగమించడానికి ఆయనెంతో సహకరించారని వెల్లడించాడు. తన కోసం 50 టేకులు చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదని తెలిపాడు. ఇంటర్వెల్ లో తనకు, మహేశ్ మధ్య వచ్చే ఫైట్ హైలెట్ గా నిలుస్తుందన్నాడు. 'శ్రీమంతుడు' సినిమాతో తెలుగులో తనకు అవకాశాలు పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన  'శ్రీమంతుడు'లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సంపత్ రాజ్, సుకన్య, ముఖేష్ రిషి ముఖ్యపాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement