'Korameenu' Telugu Movie Review and Rating - Sakshi
Sakshi News home page

Korameenu Review: ‘కొరమీను’ మూవీ రివ్యూ

Published Sat, Dec 31 2022 2:21 PM | Last Updated on Sat, Dec 31 2022 4:02 PM

Korameenu Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ‘కొరమీను.. ‘స్టోరీ ఆఫ్‌ ఈగోస్‌’ 
నటీనటులు: ఆనంద్ రవి, , హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోరీ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్ త‌దిత‌రులు
నిర్మాత: పెళ్లకూరు సమన్య రెడ్డి
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌: ఆనంద్‌ రవి
దర్శకత్వం: శ్రీపతి కర్రి
పాటలు: అనంత నారాయణన్ ఏజీ
నేపథ్య సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర
ఎడిటర్: విజయ్ వర్ధన్ కె
విడుదల తేది: డిసెంబర్‌ 31, 2022

కథేంటంటే..
మీసాల రాజు (శత్రు) ఓ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి. ఆయనకు మీసాలు అంటే చాలా ఇష్టం. బదిలీపై విజయవాడ నుంచి వైజాగ్‌కు వచ్చిన తొలి రోజే కొంతమంది అపరిచితులు మీసాల రాజు  మీసాలను బలవంతంగా తీసేస్తారు. పరువుగా భావించే తన మీసాలను తీసేయ్యాల్సిన అవసరం ఎవరికుందని విచారించడం మొదలుపెడతాడు మీసాల రాజు. ఈ క్రమంలో జాలరి పేట కరుణ గురించి తెలుస్తుంది. 

వైజాగ్‌లోని జాలరిపేటను తన గుప్పిట్లో పెటుకుంటాడు కరుణ( హరీశ్‌ ఉత్తమన్‌ ). అక్కడ డ్రగ్స్‌, ఇతర చట్ట విరుద్ద వ్యాపారాలు చేస్తూ.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు కోటి(ఆనంద్‌ రవి). అతనికి అదే గ్రామానికి చెందిన మీనాక్షి( కిశోరీ ధాత్రక్‌) అంటే పిచ్చి ప్రేమ. కానీ మీనాక్షి మాత్రం కరుణను ప్రేమిస్తుంది. కరుణ మాత్రం ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేస్తాడు. ఆ తర్వాత మీనాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆమెను కోటీ చేరదీశాడా లేదా? మీసాల రాజు మీసాలను ఎవరు తీశారు? ఎందుకు తీశారు? అసలు మీసాల రాజు విజయవాడ నుంచి వైజాగ్‌కు ఎందుకు బదిలీ అయ్యాడు? అనేదే మిగతా కథ. 
ఎలా ఉందంటే..
ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీత‌లు చెరిగిపోయాయి. ​కంటెంట్‌ బాగుంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాను. ‘కోరమీను’ కూడా అలాంటిందే. ఇగో క్లాషెస్‌ నేపథ్యంలో కథనం సాగుతుంది. కొన్ని  సినిమాల్లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, కిడ్నాప్ మిస్ట‌రీలుంటాయి. కానీ ఓ మ‌నిషికి మీసాలు ఎవ‌రు తీసేసుంటార‌నే కాన్సెప్ట్ ఎక్క‌డా లేదు. కోరమీను  క‌థ పుట్టిందే అక్క‌డ నుంచి. పేద‌వాడికి, గొప్ప వాడికి మ‌ధ్య జరిగే గొడ‌వను ఈ సినిమాలో చూపించారు.

ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్‌ మధ్య ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంది. కరుణ అరచాకాలు.. కోటీ, మీనాక్షి మధ్య జరిగే డ్రామా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. క్లైమాక్స్‌కు  30 నిమిషాల ముందు కథలో వచ్చే ట్విస్టులు సినిమా స్థాయిని పెంచేశాయి. ఎవరు ఎవరి ట్రాప్‌లో పడ్డారనే విషయాన్ని ఊహించని విధంగా, ఆసక్తికరంగా చూపించారు. ఓ సింపుల్‌ స్టోరీని నెటివిటీ టచింగ్‌ ఇచ్చి, ఆసక్తిరకంగా చూపించడంతో దర్శకుడు శ్రీపతి కర్రి సఫలం అయ్యాడు.

ఎవరెలా చేశారంటే.. 
ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడు కోటి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కావాలని హీరోయిజం చూపించకుండా..కథకు అనుగుణంగా కొన్ని సందర్భాలతో మాత్రమే ఆయన హీరోలా కనిపిస్తాడు. మిగతా అన్ని సన్నివేశాల్లో సాదారణ యువకుడిలా సింపుల్‌గా కనిపిస్తాడు. మీనాక్షీ పాత్రలో కిశోరీ ధాత్రక్ పరకాల ప్రవేశం చేసింది. రొటీన్‌ హీరోయిన్ల పాత్రకు భిన్నంగా ఆమె పాత్రను డిజైన్‌ చేశారు. ఇక విలన్‌ కరుణ పాత్రకు హరీశ్‌ ఉత్తమన్‌ న్యాయం చేశాడు. మీసాల రాజుగా శత్రు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దేవుడుగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశారు.  ఆనంద్‌ రవి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి.  ‘డబ్బుకు ఎక్కువ పవర్‌ అనుకుంటారు గానీ, అసలైన పవర్‌ భయానిదేరా’, ‘మొగుడు లేకపోతే ఆడదానికి సుఖం ఉండదు..కానీ ప్రపంచం అంతా ఆడదానికే సుఖం ఇవ్వాలనుకుంటుంది’ లాంటి డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ,  విజయ్ వర్ధన్ కె ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement