Korameenu Movie
-
నాన్న అన్న ఆ ఒక్క మాటే అతి పెద్ద కాంప్లిమెంట్: శ్రీపతి కర్రి
‘కోరమీను’ సినిమా చూసిన తర్వాత మా నాన్న ఫోన్ చేసి ‘ఈ రోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా’అన్నాడు. ఆ ఒక్కమాటే నా జీవితంలో అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్’అని యంగ్ డైరెక్టర్ శ్రీపతి కర్రి అన్నారు. ఆయన దర్శకత్వంలో ఆనంద్ రవి, కిషోరి జంటగా నటించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ అనేది ఉపశీర్షిక. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి పెళ్లకూరు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 31న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ‘కొరమీను’ చిత్రం ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ‘సినిమాపై పిచ్చితో 2006లో తాను హైదరాబాద్‌కు వచ్చాను. మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. పస్తులుండాల్సి వచ్చిన రోజుల్ని... సినిమా రంగంలో సక్సెస్ కావడానికి నేను చేస్తున్న ఉపవాసాలుగా భావిస్తుండేవాడిని. 2020లో హల్చల్ చిత్రానికి దర్శకత్వం వహించాను .ఆ చిత్రంతో మంచి పేరు వచ్చినా.. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కోడైరెక్టర్‌గా పనిచేయాల్సి వచ్చింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కోరమీనుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన రావడం ఆనందంగా ఉంది. త్వరలోనే మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించబోతున్నాను’అని శ్రీపతి కర్రి అన్నారు. -
‘కొరమీను’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కొరమీను.. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ నటీనటులు: ఆనంద్ రవి, , హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోరీ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్ తదితరులు నిర్మాత: పెళ్లకూరు సమన్య రెడ్డి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: ఆనంద్ రవి దర్శకత్వం: శ్రీపతి కర్రి పాటలు: అనంత నారాయణన్ ఏజీ నేపథ్య సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర ఎడిటర్: విజయ్ వర్ధన్ కె విడుదల తేది: డిసెంబర్ 31, 2022 కథేంటంటే.. మీసాల రాజు (శత్రు) ఓ పవర్ఫుల్ పోలీసు అధికారి. ఆయనకు మీసాలు అంటే చాలా ఇష్టం. బదిలీపై విజయవాడ నుంచి వైజాగ్‌కు వచ్చిన తొలి రోజే కొంతమంది అపరిచితులు మీసాల రాజు మీసాలను బలవంతంగా తీసేస్తారు. పరువుగా భావించే తన మీసాలను తీసేయ్యాల్సిన అవసరం ఎవరికుందని విచారించడం మొదలుపెడతాడు మీసాల రాజు. ఈ క్రమంలో జాలరి పేట కరుణ గురించి తెలుస్తుంది. వైజాగ్‌లోని జాలరిపేటను తన గుప్పిట్లో పెటుకుంటాడు కరుణ( హరీశ్ ఉత్తమన్ ). అక్కడ డ్రగ్స్, ఇతర చట్ట విరుద్ద వ్యాపారాలు చేస్తూ.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు కోటి(ఆనంద్ రవి). అతనికి అదే గ్రామానికి చెందిన మీనాక్షి( కిశోరీ ధాత్రక్) అంటే పిచ్చి ప్రేమ. కానీ మీనాక్షి మాత్రం కరుణను ప్రేమిస్తుంది. కరుణ మాత్రం ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేస్తాడు. ఆ తర్వాత మీనాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆమెను కోటీ చేరదీశాడా లేదా? మీసాల రాజు మీసాలను ఎవరు తీశారు? ఎందుకు తీశారు? అసలు మీసాల రాజు విజయవాడ నుంచి వైజాగ్‌కు ఎందుకు బదిలీ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాను. ‘కోరమీను’ కూడా అలాంటిందే. ఇగో క్లాషెస్ నేపథ్యంలో కథనం సాగుతుంది. కొన్ని సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కోరమీను కథ పుట్టిందే అక్కడ నుంచి. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను ఈ సినిమాలో చూపించారు. ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంది. కరుణ అరచాకాలు.. కోటీ, మీనాక్షి మధ్య జరిగే డ్రామా సన్నివేశాలతో ఫస్టాఫ్ సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. క్లైమాక్స్‌కు 30 నిమిషాల ముందు కథలో వచ్చే ట్విస్టులు సినిమా స్థాయిని పెంచేశాయి. ఎవరు ఎవరి ట్రాప్‌లో పడ్డారనే విషయాన్ని ఊహించని విధంగా, ఆసక్తికరంగా చూపించారు. ఓ సింపుల్ స్టోరీని నెటివిటీ టచింగ్ ఇచ్చి, ఆసక్తిరకంగా చూపించడంతో దర్శకుడు శ్రీపతి కర్రి సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడు కోటి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కావాలని హీరోయిజం చూపించకుండా..కథకు అనుగుణంగా కొన్ని సందర్భాలతో మాత్రమే ఆయన హీరోలా కనిపిస్తాడు. మిగతా అన్ని సన్నివేశాల్లో సాదారణ యువకుడిలా సింపుల్‌గా కనిపిస్తాడు. మీనాక్షీ పాత్రలో కిశోరీ ధాత్రక్ పరకాల ప్రవేశం చేసింది. రొటీన్ హీరోయిన్ల పాత్రకు భిన్నంగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ఇక విలన్ కరుణ పాత్రకు హరీశ్ ఉత్తమన్ న్యాయం చేశాడు. మీసాల రాజుగా శత్రు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దేవుడుగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశారు. ఆనంద్ రవి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. ‘డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ, అసలైన పవర్ భయానిదేరా’, ‘మొగుడు లేకపోతే ఆడదానికి సుఖం ఉండదు..కానీ ప్రపంచం అంతా ఆడదానికే సుఖం ఇవ్వాలనుకుంటుంది’ లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, విజయ్ వర్ధన్ కె ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కొరమీను’ నిరుత్సాహపరచదు: హీరో ఆనంద్ రవి
ఏడాది చివర్లో (డిసెంబర్ 31) మా ‘కొరమీను’ సినిమా వస్తోంది. ప్రేక్షకులను మా మూవీ నిరుత్సాహపరచదు’’ అని హీరో ఆనంద్ రవి అన్నారు. శ్రీపతి కర్రి దర్శకత్వంలో ఆనంద్ రవి, కిషోరి జంటగా నటించిన చిత్రం ‘కొరమీను’. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ అనేది ఉపశీర్షిక. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మహేశ్వర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీపతి కర్రి మాట్లాడుతూ– ‘‘ఒక డైరెక్టర్లా కాకుండా ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా.. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ప్రేక్షకులే మా సినిమాను ప్రమోట్ చేస్తారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు సమన్య రెడ్డి. కొరమీను, లక్కీ లక్ష్మణ్..ఒకరికొకరు మద్దతు పరిమితమైన బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాలకు సంబంధిచి కొరమీను, లక్కీ లక్ష్మణ్ సినిమా టీమ్స్ కలిసి ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఒకరోజు ముందుగా వస్తున్న లక్కీ లక్ష్మణ్ టీమ్ మంగళవారం రాత్రి జరిగిన తమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొరమీను టీమ్‌ను ఆహ్వానించగా హీరో ఆనంద్ రవి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియజేశారు. అలాగే బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్కీ లక్ష్మణ్ టీమ్‌ని కొరమీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్, హీరోయిన్ మోక్ష హాజరై తమ విషెష్‌ను అందించారు. ఇలా ఒకరికొకరు సపోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే సరికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం పలికాయి. దీన్ని ఇలాగే అందరూ కొనసాగిస్తే బావుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. -
వైజాగ్‌ని వైవిధ్యంగా చూపించాను: ‘కొరమీను’ డైరెక్టర్
‘‘ఏ సినిమాకైనా కథే ముఖ్యం. ‘కొరమీను’కి ఆనంద్ రవిగారు మంచి కథ ఇచ్చారు. నేను పుట్టి పెరిగిన వైజాగ్‌ని ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపించాను. సమన్య రెడ్డిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు శ్రీపతి కర్రి. ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరమీను’. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తెలిసిందే లే..’ అనే పాటను ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ, సింగర్ సునీత విడుదల చేశారు. సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ రవిగారు కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మీసాల రాజుకి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు ఆనంద్ రవి. -
అలాంటి సినిమాలే సక్సెస్ అవుతాయి.. సింగర్ సునీత
ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్ వచ్చేసింది. తెలిసిందేలే అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. 'మా టీమ్‌కి సపోర్ట్ చేయటానికి వచ్చిన దర్శకులు వశిష్టగారికి, సింగర్ సునీత గారికి థాంక్స్. సినిమాకు కథ ప్రధానం. అది బావుంటే అన్నింటినీ అదే తీసుకొస్తుంది. ఆనంద్ రవి అంత మంచి కథను ఇచ్చారు. ఆయన దగ్గరే విషయాలు నేర్చుకున్నా. మా గురువుగారినే డైరెక్ట్ చేశా. కథను చక్కగా డ్రైవ్ చేసేది టీమ్.' అని అన్నారు. నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ..'ఆనంద్ రవి కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కీ రోల్లో శత్రు, విలన్‌గా హరీష్ ఉత్తమన్గా తీసుకోవాలని అనుకున్నాం. ఇక హీరోగా ఆనంద్ రవిగారు అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది.' అని అన్నారు. (ఇది చదవండి: 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్) దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ..'ప్రతినిధి, నెపోలియన్ సినిమాలకు రైటర్‌గా, హీరోగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్‌ప్లే అందించి హీరోగా కూడా నటించారు. ఈ సినిమాతోనూ సక్సెస్ సాధిస్తారని భావిస్తున్నా. నిర్మాత, దర్శకుడితో సహా అందరికీ ఆల్ ది బెస్ట్.' అని అన్నారు. సింగర్ సునీత్ మాట్లాడుతూ..'ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బావుంటే కొత్త నటీనటులతో చేసిన మూవీ అయినా ప్రపంచ వ్యాప్తంగా పేరుని సంపాదించుకుంటోంది. అటువంటి లిస్టులో కొరమీను సినిమా కూడా చేరుతుంది. మన జీవన విధానానికి దగ్గరగా ఉండే సినిమాలు సక్సెస్ అవుతాయి.' అని అన్నారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. 'కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశా. ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కథ పుట్టిందే అక్కడ నుంచే. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. మీరు సినిమా చూస్తే సర్ ప్రైజ్ అవుతారు. డిసెంబర్ 31న సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.' అని అన్నారు. 'కొరమీను' కథ విషయానికి వస్తే... జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. -
Korameenu: అసలైన పవర్ భయానిదేరా!
ఆనంద్ రవి హీరోగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోర్ దత్రక్, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. పెళ్లకూరు సమస్య రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని విడుదల చేశారు.'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట... వాళ్ళ క్యారెక్టరైజేషన్లు చెప్పేలా ఉన్నాయి. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. టీజర్ చివర్లో గిరిధర్, ఇమ్మాన్యుయేల్ సీన్‌తో సినిమాలో కామెడీ కూడా ఉందని హింట్ ఇచ్చారు. ‘డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ, అసలైన పవర్ భయానిదేరా’ అంటూ హరీశ్ ఉత్తమన్ చెప్పే డైలాగ్ టీజర్లో ఉంది. ‘జాలరిపేట అనే మత్యకారుల కాలనీకి వస్తాడు పోలీసు మీసాల రాజు. ఆయన మీసాలు ఎవరు తీశారనేది ఆసక్తిగా ఉంటుంది’అన్నారు శ్రీపతి కర్రి. ఈ చిత్రంలో కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.