
‘‘ఏ సినిమాకైనా కథే ముఖ్యం. ‘కొరమీను’కి ఆనంద్ రవిగారు మంచి కథ ఇచ్చారు. నేను పుట్టి పెరిగిన వైజాగ్‌ని ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపించాను. సమన్య రెడ్డిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు శ్రీపతి కర్రి. ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరమీను’. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్‌ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది.
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తెలిసిందే లే..’ అనే పాటను ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ, సింగర్ సునీత విడుదల చేశారు. సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ రవిగారు కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మీసాల రాజుకి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు ఆనంద్ రవి.
Comments
Please login to add a commentAdd a comment