Korameenu: అసలైన పవర్‌ భయానిదేరా!  | Director Gopichand Malineni Released Korameenu Teaser | Sakshi

Korameenu: అసలైన పవర్‌ భయానిదేరా! 

Nov 6 2022 10:26 AM | Updated on Nov 6 2022 10:26 AM

Director Gopichand Malineni Released Korameenu Teaser - Sakshi

ఆనంద్‌ రవి హీరోగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. హరీష్‌ ఉత్తమన్‌, శత్రు, కిశోర్‌  దత్రక్‌, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. పెళ్లకూరు సమస్య రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు.'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట... వాళ్ళ క్యారెక్టరైజేషన్లు చెప్పేలా ఉన్నాయి.

ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. టీజర్ చివర్లో గిరిధర్, ఇమ్మాన్యుయేల్ సీన్‌తో సినిమాలో కామెడీ కూడా ఉందని హింట్ ఇచ్చారు.  ‘డబ్బుకు ఎక్కువ పవర్‌ అనుకుంటారు గానీ, అసలైన పవర్‌ భయానిదేరా’ అంటూ హరీశ్‌ ఉత్తమన్‌ చెప్పే డైలాగ్‌ టీజర్‌లో ఉంది. ‘జాలరిపేట అనే మత్యకారుల కాలనీకి వస్తాడు పోలీసు మీసాల రాజు. ఆయన మీసాలు ఎవరు తీశారనేది ఆసక్తిగా ఉంటుంది’అన్నారు శ్రీపతి కర్రి. 

ఈ చిత్రంలో కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement