రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్ | 'Pandiya Naadu' villain set for Telugu debut | Sakshi
Sakshi News home page

రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్

Jul 27 2014 1:05 PM | Updated on Sep 2 2017 10:58 AM

రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్

రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్

తమిళ చిత్రం 'పాండియనాడు'లో ప్రతినాయకుడిగా నటించిన హరీష్ ఉత్తమన్ టాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు.

చెన్నై: తమిళ చిత్రం 'పాండియనాడు'లో ప్రతినాయకుడిగా నటించిన హరీష్ ఉత్తమన్ టాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు. తెలుగులో రెండు అవకాశాలు చేజిక్కించుకున్నాడు. రవితేజ్ హీరోగా నటిస్తున్న 'పవర్' సినిమాలో అతడు విలన్ గా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నాడు.

'పాండియనాడు'లో తన నటన చూసి 'పవర్' దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) తనను సంప్రదించారని హరీష్ తెలిపాడు. గోపీచంద్ సినిమాలోనూ అవకాశం వచ్చిందని తెలిపాడు. ఈ రెండు సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నానని చెప్పాడు. అరడజను సినిమాలు తన చేతిలోనే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. గతేడాది విడుదలైన 'పాండియనాడు' తమిళనాట ఘన విజయం సాధించింది. విశాల్, లక్ష్మీమీనన్ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement