Pandiya Naadu
-
రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్
చెన్నై: తమిళ చిత్రం 'పాండియనాడు'లో ప్రతినాయకుడిగా నటించిన హరీష్ ఉత్తమన్ టాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు. తెలుగులో రెండు అవకాశాలు చేజిక్కించుకున్నాడు. రవితేజ్ హీరోగా నటిస్తున్న 'పవర్' సినిమాలో అతడు విలన్ గా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నాడు. 'పాండియనాడు'లో తన నటన చూసి 'పవర్' దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) తనను సంప్రదించారని హరీష్ తెలిపాడు. గోపీచంద్ సినిమాలోనూ అవకాశం వచ్చిందని తెలిపాడు. ఈ రెండు సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నానని చెప్పాడు. అరడజను సినిమాలు తన చేతిలోనే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. గతేడాది విడుదలైన 'పాండియనాడు' తమిళనాట ఘన విజయం సాధించింది. విశాల్, లక్ష్మీమీనన్ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. -
ఫ్లాప్ అయితే పార్టీలే
అన్ని రంగాల్లో లాగానే సినిమా రంగంలోనూ మంచీ, చెడు ఉంటాయి. ఇతర హీరో, హీరోయిన్ల చిత్రాలు ఫ్లాప్ అయితే సంతోషంతో సంబరాలు జరుపుకోవడం, పార్టీలు చేసుకోవడం, చిత్రం సక్సెస్ అయితే వసూళ్ల వర్షం, బాక్సాఫీస్ షేక్ అంటూ ఆ చిత్ర వర్గాలు పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ సంస్కృతి బాలీవుడ్ నుంచి దక్షిణాదికి పాకిందనే చెప్పాలి. ప్లాఫ్ అయితే పరిశ్రమలోని కొన్ని వర్గాల వారు సంతోషిస్తున్నారు. కోలీవుడ్‌ను తీసుకుంటే ఇటీవల నటుడు విశాల్ నటించి నిర్మించిన పాండియనాడు చిత్రం సక్సెస్ సాధించడంతో ఆ చిత్ర యూనిట్ ఆనందంతో పార్టీ చేసుకుంది. అదే విధంగా ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ చిత్ర హీరో అంటే పడని కొందరు పార్టీ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆ హీరో మనసు గాయపడిందట. దీంతో ఆయన వర్గం డోంట్వర్రి తదుపరి చిత్రంలో హిట్ గ్యారెంటీ అంటూ సముదాయించే ప్రయత్నం చేశారట. ఇక టాలీవుడ్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఇటీవల నటి సమంత నటించిన చిత్రం శ్రుతిహాసన్ నటించిన మరో చిత్రం విడుదలయ్యాయి. వీటిలో సమంత నటించిన చిత్రం ఘన విజయం సాధించగా, శ్రుతిహాసన్ చిత్రం అపజయం పాలయ్యింది. సమంత నటించిన చిత్ర యూనిట్ తమ చిత్రం సక్సెస్ పేరుతో శ్రుతిహాసన్ చిత్రం ఫ్లాప్‌ను ఎంజాయ్ చేస్తూ పార్టీ జరుపుకున్నారట. ఇది మంచి సంస్కృతి కాదని, అన్ని చిత్రాల విజయం సాధించాలని కోరుకోవాలని, అప్పుడే చిత్ర పరిశ్రమ పదికాలాలపాటు పచ్చగా ఉంటుందని కొందరు సినీ పండితులు హితవు పలుకుతున్నారు. -
మళ్లీ అదే జంట
తాము జంటగా నటించిన చిత్రం తెరపైకి రాక ముందే మరో చిత్రంలో నటించడానికి అంగీకరించారు విశాల్, లక్ష్మీమీనన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం పాండియనాడు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీపావళికి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విశాల్, లక్ష్మీమీనన్ జంట చూడ ముచ్చటగా ఉందని యూనిట్ సభ్యులు, ఎగ్జిబిటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాండియనాడు విడుదల కాకముందే విశాల్, లక్ష్మీమీనన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవడం మరో విశేషం. ఇంతకముందు విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు తిరు. ఆయన మూడో చిత్రంలోనూ విశాల్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా లక్ష్మీమీనన్ నటించనుంది. అదే విధంగా విశాల్ హరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇంతకముందు వీరి కాంబినేషన్లో తామరభరణి వంటి విజయవంతమైన చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాలు ఏడాది చివరిలో లేదా 2014 ప్రథమార్థంలో ప్రారంభం కానున్నాయి.