మళ్లీ అదే జంట | vishal lakshmi memon paired up again in new movie | Sakshi
Sakshi News home page

మళ్లీ అదే జంట

Published Sun, Oct 20 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

మళ్లీ అదే జంట

మళ్లీ అదే జంట

 తాము జంటగా నటించిన చిత్రం తెరపైకి రాక ముందే మరో చిత్రంలో నటించడానికి అంగీకరించారు విశాల్, లక్ష్మీమీనన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం పాండియనాడు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీపావళికి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విశాల్, లక్ష్మీమీనన్ జంట చూడ ముచ్చటగా ఉందని యూనిట్ సభ్యులు, ఎగ్జిబిటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
 
  పాండియనాడు విడుదల కాకముందే విశాల్, లక్ష్మీమీనన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవడం మరో విశేషం. ఇంతకముందు విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు తిరు. ఆయన మూడో చిత్రంలోనూ విశాల్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా లక్ష్మీమీనన్ నటించనుంది. అదే విధంగా విశాల్ హరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇంతకముందు వీరి కాంబినేషన్‌లో తామరభరణి వంటి విజయవంతమైన చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాలు ఏడాది చివరిలో లేదా 2014 ప్రథమార్థంలో ప్రారంభం కానున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement