ఫ్లాప్ అయితే పార్టీలే
ఫ్లాప్ అయితే పార్టీలే
Published Thu, Nov 21 2013 4:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
అన్ని రంగాల్లో లాగానే సినిమా రంగంలోనూ మంచీ, చెడు ఉంటాయి. ఇతర హీరో, హీరోయిన్ల చిత్రాలు ఫ్లాప్ అయితే సంతోషంతో సంబరాలు జరుపుకోవడం, పార్టీలు చేసుకోవడం, చిత్రం సక్సెస్ అయితే వసూళ్ల వర్షం, బాక్సాఫీస్ షేక్ అంటూ ఆ చిత్ర వర్గాలు పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ సంస్కృతి బాలీవుడ్ నుంచి దక్షిణాదికి పాకిందనే చెప్పాలి. ప్లాఫ్ అయితే పరిశ్రమలోని కొన్ని వర్గాల వారు సంతోషిస్తున్నారు. కోలీవుడ్‌ను తీసుకుంటే ఇటీవల నటుడు విశాల్ నటించి నిర్మించిన పాండియనాడు చిత్రం సక్సెస్ సాధించడంతో ఆ చిత్ర యూనిట్ ఆనందంతో పార్టీ చేసుకుంది.
అదే విధంగా ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ చిత్ర హీరో అంటే పడని కొందరు పార్టీ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆ హీరో మనసు గాయపడిందట. దీంతో ఆయన వర్గం డోంట్‌వర్రి తదుపరి చిత్రంలో హిట్ గ్యారెంటీ అంటూ సముదాయించే ప్రయత్నం చేశారట. ఇక టాలీవుడ్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఇటీవల నటి సమంత నటించిన చిత్రం శ్రుతిహాసన్ నటించిన మరో చిత్రం విడుదలయ్యాయి.
వీటిలో సమంత నటించిన చిత్రం ఘన విజయం సాధించగా, శ్రుతిహాసన్ చిత్రం అపజయం పాలయ్యింది. సమంత నటించిన చిత్ర యూనిట్ తమ చిత్రం సక్సెస్ పేరుతో శ్రుతిహాసన్ చిత్రం ఫ్లాప్‌ను ఎంజాయ్ చేస్తూ పార్టీ జరుపుకున్నారట. ఇది మంచి సంస్కృతి కాదని, అన్ని చిత్రాల విజయం సాధించాలని కోరుకోవాలని, అప్పుడే చిత్ర పరిశ్రమ పదికాలాలపాటు పచ్చగా ఉంటుందని కొందరు సినీ పండితులు హితవు పలుకుతున్నారు.
Advertisement
Advertisement