Viral: Actor Hairsh Uthaman Second Marriage With Malayalam Actress Chinnu Kuruvilla - Sakshi
Sakshi News home page

Harish Uthaman - Chinnu Kuruvilla: మలయాళ నటితో నటుడి రెండో పెళ్లి

Published Fri, Jan 21 2022 2:40 PM | Last Updated on Fri, Jan 21 2022 5:40 PM

Harish Uthaman Second Marriage With Actress Chinnu Kuruvilla - Sakshi

తమిళ నటుడు హరీశ్‌ ఉత్తమన్‌ ఓ ఇంటివాడయ్యాడు. మలయాళ నటి చిన్ను కురువిల్లను పెళ్లాడాడు. గురువారం(జనవరి 20న) కేరళ మవెలిక్కరలోని రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. 

Harish Uthaman Second Marriage With Chinnu Kuruvilla

ఇదిలా ఉంటే చిన్ను పలు మలయాళ చిత్రాల్లో నటించింది. 'నార్త్‌ 24 కతమ్‌', 'కసాబా', 'లుక్కా చుప్పి' వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక హరీశ్‌ విషయానికి వస్తే అతడు 'తని ఒరువన్‌', 'తొడారి', 'భైరవ', 'పాండ్య నాయుడు', 'పాయుం పులి', 'నట్పే తునై' తదితర చిత్రాల్లో నటించాడు. శ్రీమంతుడు, అశ్వత్థామ, వి, నాంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యాడు. కాగా ఇతడు 2018లో మేకప్‌ ఆర్టిస్ట్‌ అమృత కల్యాణ్‌పుర్‌ను వివాహమాడాడు. కానీ వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో ఏడాదికే విడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement