
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రంభ. వీటితో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా మెరిశారు. కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రన్ పద్మనాభన్‌తో వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. కాగా తను మూడో బేబికి జన్మనివ్వబోతున్నానే శుభవార్తను రంభ ఇటీవలే తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భర్త, బంధువుల సమక్షంలో రంభ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1990ల్లో హీరోలతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసిన రంభ.. తన సీమంతం వేడుకలోనూ స్టెప్పులతో అదరగొట్టారు.






Comments
Please login to add a commentAdd a comment