Upasana Konidela Baby Shower At Chiranjeevi's House, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Upasana Baby Shower: ఉపాసన బేబీ షవర్‌.. సోషల్ మీడియాలో వైరల్

Published Thu, Apr 20 2023 3:25 PM | Last Updated on Thu, Apr 20 2023 5:06 PM

Upasana Konidela Shares Baby Shower Pics Goes Viral - Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంటుంది. తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. రామ్‌ చరణ్‌- ఉపాసన త్వరలోనే తల్లిదండ్రలు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసనకు డెలివరీ సమయం దగ్గరపడుతోంది. తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాలో బేబీ షవర్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాలో స్టోరీస్‌ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

తాజాగా చిరంజీవి నివాసంలో నిర్వహించిన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అల్లు అర్జున్ అన్నయ్య భార్య అల్లు నీలు షాతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఉపాసన బేబీ షవర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే వెకేషన్‌కు వెళ్లిన ఈ జంట దుబాయ్‌లోనూ సన్నిహితులు, స్నేహితుల మధ్య సీమంతం వేడుక జరుపుకున్నారు. ఆ తర్వాత మాల్దీవుస్‌ చేరుకున్న చెర్రీ-ఉపాసన హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. జూలైలో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు మెగాకుటుంబంతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement