Ram Charan Wife Upasana Konidela Baby Shower Pics Viral - Sakshi
Sakshi News home page

Upasana: ఉపాసన సీమంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Apr 24 2023 9:32 PM | Updated on Apr 25 2023 11:10 AM

Upasana Konidela Baby Shower Pics Goes Viral In Social Media - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌,  ఉపాసన టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో ఒకరు. మొదటి నుంచీ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న జంట. ఆమె గురించి అతను ఎక్కడ మాట్లాడినా ఆప్యాయత కురిసినట్లే ఉంటుంది. మిస్టర్‌ సీ అంటూ అతని కోసం ఆమె ఏం రాసినా అద్భుతంగానే అనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని.. కలిసిమెలిసి ఉండాల్సిన దంపతులకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా అనిపిస్తుంటారు ఇద్దరూ.

వారి మధ్య అన్యోన్యతకు మన దగ్గరివారే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఆనందించారు. ఆస్కార్‌కి రెడీ అవుతున్న ఈ దంపతుల మీద ఆ మధ్య వేనిటీ ఫెయిర్‌ ఓ వీడియో రికార్డ్ చేసింది. వేనిటీ ఫెయిర్‌ ఇప్పటిదాకా అప్‌లోడ్‌ చేసిన అన్నీ వీడియోల రికార్డులనూ బద్ధలు కొట్టేశారు ఉపాసన- రామ్‌చరణ్ దంపతులు. గర్భవతి అయిన తన భార్యను రామ్‌చరణ్‌ అపురూపంగా చూసుకుంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

దుబాయ్‌లో జరిగిన సీమంతం ఫొటోలు కూడా చాలా వేగంగా వైరలయ్యాయి. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌లో మరో రెండు వేడుకలు కూడా వైభవంగా జరిగాయి. ఒక వేడుకలో ఉపాసన పింక్‌ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. మరో చోట బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్‌తో తళుక్కుమన్నారు.

ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్‌, అల్లు అర్జున్‌తోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు.  అలాగే కుటుంబసభ్యులు చిరంజీవి కొణిదెల, సురేఖ, చెల్లెళ్లు సుష్మిత, శ్రీజతో పాటు ఉపాస‌న త‌ల్లి  శోభన కామినేని, సంగీతారెడ్డి, సుష్మిత, శ్రీజ కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందోత్సాహంలో మునిగిపోయారు. కాబోయే అమ్మ ఉపాసనను తమ ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కాబోతున్న క్షణాల కోసం వేచిచూస్తున్నామని అంటున్నారు సన్నిహితులు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement