Ram Charan Wife Upasana Konidela Baby Shower Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Upasana: ఉపాసన మెడలో పూలదండ వేసి గిఫ్ట్స్‌ ఇచ్చిన ఫ్రెండ్స్‌

Published Fri, Feb 17 2023 11:15 AM | Last Updated on Fri, Feb 17 2023 12:00 PM

Ram Charan Wife Upasana Baby Shower Photos - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో రామ్‌చరణ్‌-ఉపాసన జంటకు ప్రత్యేక స్థానం ఉంది. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో ఆమె స్నేహితులు చరణ్‌ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి సీమంతం చేశారు. అందులో భాగంగా ఆమె మెడలో పూలదండ వేసి తనకు గిఫ్టులు బహుకరించారు. ఈ ఫోటోలను బేబీ కమింగ్‌ సూన్‌ అంటూ  చరణ్‌ సతీమణి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ఈ పిక్స్‌లో ఉపాసన గ్లోతో మెరిసిపోతుండగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవలే ఘనంగా జరిగాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సద్గురు, ఆయన కుమార్తె హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఉపాసన. ఇద్దరు కూతుర్లతో సద్గురు.. ఒకరు సొంత బిడ్డ అయితే మరొకరు దత్తపుత్రిక అని రాసుకొచ్చింది.

చదవండి: రెండుసార్లు జైలుకెళ్లా.. నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement