
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, హీరోయిన్ కంగనా రనౌత్ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఆమె ఇంట్లో త్వరలో బుల్లి రనౌత్ రాబోతోంది. అవును, నిజమే.. కంగనా సోదరుడు అక్షత్ రనౌత్- రీతూ రనౌత్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలో రీతూ సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఈ బ్యూటీ క్వీన్ పింక్ కలర్ చీరలో, బంగారు ఆభరణాలతో ధగధగ మెరిసిపోయింది. చేతులకు మెహందీ కూడా వేసుకుంది. అక్టోబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న వదినకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది.
'రీతూ రనౌత్ సీమంతం సెలబ్రేషన్స్‌లోని కొన్ని అద్భుతమైన క్షణాలను పంచుకుంటున్నాను. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. బేబీ రనౌత్ రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది కంగనా. ఈ ఫోటోలో కంగనా తల్లి ఆశా, సోదరి రంగోలి, అన్నావదిన ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అనుపమ్ ఖేర్, మహిమ చౌదరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది.
చదవండి: కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్, మొన్ననే తల్లికి గుండెపోటు, అప్పుడే కారు కొన్నావా?
ఓపెన్ హైమర్ చిత్రంలో ఆ సీన్ తొలగించండి
Comments
Please login to add a commentAdd a comment