తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్! | [Tollywood Young Hero Nikhil Siddharth Going To Become Father, His Wife Seemantham Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: నిఖిల్‌ భార్య సీమంతం వేడుక.. ట్వీట్‌ చేసిన హీరో!

Published Wed, Jan 31 2024 9:27 PM | Last Updated on Thu, Feb 1 2024 12:03 PM

Tollywood Young Hero Going To Become Father - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు.  సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్‌.
 
నిఖిల్ తన ట్విటర్‌లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. 'హ్యాపీడేస్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్​. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఓ వారియర్​ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు  యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement