Gauahar Khan Shares Baby Shower Photos With Beautiful People - Sakshi
Sakshi News home page

Gauahar Khan: ఘనంగా నటి సీమంతం, ఫోటోలు, వీడియోలు వైరల్‌

Published Fri, May 5 2023 10:45 AM | Last Updated on Fri, May 5 2023 11:10 AM

Gauahar Khan Shares Baby Shower Photos - Sakshi

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ బ్యూటీ గౌహర్‌ ఖాన్‌ త్వరలో తల్లి కాబోతోంది. డిసెంబర్‌లో ఈ గుడ్‌ న్యూస్‌ను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాం అంటూ గౌహర్‌, ఆమె భర్త జైద్‌ దర్బార్‌.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశారు. ఆదివారం నటి సీమంతం ఘనంగా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను గౌహర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

'ప్రత్యేకమైన వ్యక్తుల మధ్య, రుచికరమైన భోజనంతో, అమితమైన ప్రేమాభిమానాల మధ్య నా సీమంతం వేడుక సంతోషంగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్‌లో గౌహర్‌ మల్టీకలర్‌ లెహంగా ధరించగా జైద్‌ అందుకు మ్యాచింగ్‌ షర్ట్‌ వేసుకున్నాడు. ఫ్రెండ్స్‌తో, అలాగే బోలెడన్ని కేక్స్‌ మధ్య వీరు దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా గౌహర్‌ ఖాన్‌ రాకెట్‌ సింగ్‌: సేల్స్‌మెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించింది., గేమ్‌, 14 ఫెరే.. వంటి పలు చిత్రాల్లో నటించింది. ఝలక్‌ దిఖ్‌ లాజా 3, బిగ్‌బాస్‌ 7, ఫియర్‌ ఫ్యాక్టర్‌: ఖత్రోన్‌ కే ఖిలాడీ 5 వంటి రియాలిటీ షోలలనూ పాల్గొంది. తాండవ్‌, సాల్ట్‌ సిటీ, శిక్షా మండల్‌ వెబ్‌ సిరీస్‌లలో నటించింది. ఇటీవలే నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమైన ఇన్‌ రియల్‌ లవ్‌  షోలో రణ్‌విజయ్‌ సింగ్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రముఖ గాయకుడు, కంపోజర్‌ ఇస్మాయిల్‌ దర్బార్‌ కుమారుడైన జైద్‌ దర్బార్‌ను 2020 డిసెంబర్‌లో పెళ్లాడింది.‌

చదవండి: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: ధనుస్‌ సోదరుడు
అల్లరి నరేశ్‌ ఉగ్రం ట్విటర్‌ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement