నటి స్నేహా రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సీమంతం వేడుక ఇటీవల చెన్నైలో కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల సమక్షంలో జరిగింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు స్నేహ. వీరికి ఇప్పటికే కుమారుడు నిహాస్ ఉన్నాడు. సీమంతం వేడుక ఫోటోలను స్నేహా షేర్ చేయడంతో ...ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాహం అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె... ఓ బిడ్డకు జన్మినిచ్చారు. ఆ తర్వాత స్నేహా నటనలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment