దుబాయ్‌లో బేబీ షవర్‌ | Ram Charan, Upasana Baby Shower Party at Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో బేబీ షవర్‌

Published Tue, Apr 4 2023 2:44 AM | Last Updated on Tue, Apr 4 2023 2:44 AM

Ram Charan, Upasana Baby Shower Party at Dubai - Sakshi

రామ్‌చరణ్‌–ఉపాసన ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తల్లి దండ్రులు కాబోతున్న ఆనందం అది. ఇటీవల లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్‌ అవార్డు వేడుకకు హాజరైన ఈ దంపతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అక్కడి నమ్మోస్‌ బీచ్‌ క్లబ్‌లో ఉపాసన బేబీ షవర్‌ జరిగింది.

ఈ వేడుకలో రామ్‌చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్‌ పాల్గొన్నారని సమాచారం. కొన్ని ఫొటోలను ఉపాసన షేర్‌ చేశారు. వేడుకలో తెలుపు రంగు గౌనులో ఆమె మెరిసిపోయారు. కొన్నాళ్లు దుబాయ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసి, చరణ్‌–ఉపాసన ఇండియా చేరుకుంటారట. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా షూట్‌లో పాల్గొంటారు చరణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement