సీమంతం వేడుక..స్టెప్పులతో అదరగొట్టారు! | Rambha Danced Like No Ones Watching At Her Baby Shower | Sakshi
Sakshi News home page

సీమంతం వేడుక..స్టెప్పులతో అదరగొట్టారు!

Published Tue, Aug 14 2018 3:35 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందారు రంభ. వీటితో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా మెరిశారు. కెనడా బిజినెస్‌మ్యాన్‌ ఇంద్రన్‌ పద్మనాభన్‌తో వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. కాగా తను మూడో బేబికి జన్మనివ్వబోతున్నానే శుభవార్తను రంభ ఇటీవలే తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో భర్త, బంధువుల సమక్షంలో రంభ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1990ల్లో హీరోలతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసిన రంభ.. తన సీమంతం వేడుకలోనూ స్టెప్పులతో అదరగొట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement