Alia Bhatt Baby Shower Photos Viral - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఆలియా భట్‌ సీమంతం ఫంక్షన్‌ ఫొటోలు వైరల్‌

Published Thu, Oct 6 2022 9:27 PM | Last Updated on Fri, Oct 7 2022 8:43 AM

Alia Bhatt Baby Shower Photos Goes Viral - Sakshi

ప్రముఖ హీరోయిన్‌ ఆలియా భట్‌ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో ఆమెకు సీమంతం జరిపారు. ముంబైలోని రణ్‌బీర్‌ ఇంట్లో బుధవారం నాడు ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సీమంతం ఫంక్షన్‌లో ఆలియా భర్త రణ్‌బీర్‌తో పాటు తల్లిదండ్రులు సోని రజ్దాన్‌- మహేశ్‌ భట్‌, అత్త నీతూ కపూర్‌తో ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే తన బంధువులు, చెల్లెల్లు, స్నేహితులతో కలిసి ఫొటోలు దిగింది.

ఈ సెలబ్రేషన్‌కు శ్వేత బచ్చన్‌, నిఖిల్‌ నందా, రీమా జైన్‌,  కరణ్‌ జోహార్‌, అయాన్‌ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'జస్ట్‌ లవ్‌' అని రాసుకొచ్చింది. కాగా రణ్‌బీర్‌, ఆలియా 2017లో బ్రహ్మాస్త్ర షూటింగ్‌ సమయంలో ప్రేమించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన బ్రహ్మాస్త్ర గత నెలలో రిలీజైంది.

చదవండి: మూడుసార్లు కోమాలోకి గీతూ, డాక్టర్లు కూడా కష్టమన్నారు
బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో నటుడు, చివరికి మృత్యు ఒడిలోకి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement