టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. తన జీవితంలో ఒక ముఖ్యమైన విశేషం గురించి ఉపాసన గత ఏడాది డిసెంబరులో ప్రకటించి నప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. దీనికి తగ్గట్టుగానే లగ్జరీ మెటర్నిటీ ఫ్యాషన్ స్టయిల్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా సన్నిహితులు, ఫ్రెండ్స్‌తో సమక్షంలో ఘనంగా నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు వైరల్‌గా మారాయి. రామ్‌చరణ్, ఉపాసన స్నేహితులు, స్మితారెడ్డి, సరిన్ కట్టా త్వరలో కాబోయే మమ్మీకి ఇంటిమేట్ బేబీ షవర్‌ను నిర్వహించారు. ఈ బేబీ షవర్‌కి అల్లు అర్జున్, సానియా మీర్జా, కనికా కపూర్ , వారి ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం, ఉపాసన గులాబీ రంగు గౌన్‌లో, తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పింక్ గౌన్ ధరే ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉపాసన కామినేని పింక్ డ్రెస్ రూ. 90 వేలు
ఉపాసన కామినేని యొక్క పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్‌లో అందంగా ముస్తాబయ్యారు. డీప్ వీనెక్‌తో ,షార్ట్ స్లీవ్స్‌తో ఉన్న గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్‌కు చెందింది. దీని ధర 1102 డాలర్లు. అంటే మన కరెన్సీలో (టాక్స్‌లు అన్ని కలిపి) అక్షరాలా రూ. 90,471.
ఏప్రిల్ 19, 2023న త్వరలో కాబోతున్న మమ్మీ ఉపాసన కామినేనికి రామ్ చరణ్ కుటుంబం బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుక కోసం, ఉపాసన జపనీస్ బ్రాండ్ ఇస్సీ మియాకే నుండి బ్లూ కలర్ ప్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్‌లో అలరించింది. ప్లీటెడ్ హాఫ్-స్లీవ్ ట్యూనిక్ బాడీ ఫిట్, ఫ్లేర్ ప్లీట్స్, సైడ్ గస్సెట్, ఫ్లేర్డ్ షేప్ హై నెక్ ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో, ట్యూనిక్ ధర 430 డాలర్లు అంటే రూ. 35,352 అన్నమాట.
వైట్ ఫ్లవర్ డ్రెస్ 1.12 లక్షలు
ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి కాబోయే మమ్మీ ఉపాసన గ్లామరస్ ప్రెగ్నెన్సీ స్టైల్‌లో తన ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నారు. మొదటి మూడు నెలల్లో ఒకసారి తెల్లటి-రంగు పూల డ్రెస్‌లో బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మెర్‌మాన్‌కు చెందినది. దీని ధర సుమారు రూ. 1,11,651.
Comments
Please login to add a commentAdd a comment