Glenn Maxwell Wedding Card Leaked: Glenn Reaction Goes Viral - Sakshi
Sakshi News home page

Glenn Maxwell Wedding: ఆ విషయం గురించి అతడు చెప్పేంత వరకు తెలియదు.. అప్‌సెట్‌ అయిన మాక్సీ

Published Wed, Feb 16 2022 10:53 AM | Last Updated on Wed, Feb 16 2022 12:19 PM

Glenn Maxwell Wedding: Very Worried And Upset Here Over Card Leak - Sakshi

Glenn Maxwell Wedding: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన విని రామన్‌ను అతడు వివాహమాడనున్నాడు. మెల్‌బోర్న్‌లో ఈ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా మాక్సీ- వినీ పెళ్లి కార్డు ఇదేనంటూ సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ ఫొటో వైరల్‌ అవుతోంది.

ఇందులో భాగంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా కార్డు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం పట్ల మాక్స్‌వెల్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. వేదిక ఎక్కడో తెలిసిపోవడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాపోయాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 అనంతరం ఫాక్స్‌ క్రికెట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో నాతో పాటు ఆడిన ఓ క్రికెటర్‌ నా పెళ్లికార్డుకు సంబంధించిన ఫొటో పంపించాడు. తమిళ్‌లో ఉన్న లేఖను పంపాడు.

ఇందులో అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంది. దురదృష్టవశాత్తూ ఇది ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. కాబట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగే మా వివాహ వేడుకను భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ 11 కోట్లు వెచ్చించి మాక్సీని రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి నేపథ్యంలో అతడు పాకిస్తాన్‌ టూర్‌కు దూరం కానున్నాడు. అదే విధంగా ఆరంభ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు.

చదవండి: Aus Vs Sl- Mitchell Starc: క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement