మాక్స్‌వెల్ కీల‌క నిర్ణ‌యం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం | Glenn Maxwell signs up to play for Washington Freedom in Major League Cricket | Sakshi
Sakshi News home page

మాక్స్‌వెల్ కీల‌క నిర్ణ‌యం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం

Published Thu, Apr 18 2024 5:39 PM | Last Updated on Thu, Apr 18 2024 5:45 PM

Glenn Maxwell signs up to play for Washington Freedom in Major League Cricket - Sakshi

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్  మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజ‌న్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ త‌ర‌పున మాక్స్‌వెల్ ఆడ‌నున్నాడు. ఈ మెర‌కు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్ప‌టికే వాషింగ్టన్ ఫ్రీడమ్ జ‌ట్టులో త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌లు సైతం చేరారు.

తాజాగా మాక్సీ కూడా జ‌త‌క‌ట్ట‌డంతో  వాషింగ్టన్ ఫ్రాంచైజీ టైటిలే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగ‌నుంది. కాగా ఐపీఎల్‌-2024 సీజ‌న్ మ‌ధ్య నుంచి మాక్స్‌వెల్ త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా బాగా ఆలిసిపోయానంటూ మాక్స్‌వెల్ తాత్కాలిక విరామం తీసుకున్నాడు.

ఈ లీగ్‌లో ఆర్సీబీ జట్టుకు త‌న‌ అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్‌వెల్ పేర్కొన్నాడు. కాగా  ఈ ఏడాది సీజ‌న్‌లో మాక్సీ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్‌వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. ఇక యూనైటడ్‌ స్టేట్స్‌ నిర్వహిస్తున్న ఈ  మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ రెండో సీజన్‌ జూలై 4నుంచి ప్రారంభం కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement