ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాక్సీ కూడా ఆర్సీబీతో కొనసాగేందుకు సముఖత చూపడం లేదని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. తాజాగా మాక్స్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ పేజిని ఆన్ ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది
కాగా ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ను ఐపీఎల్-2021 మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ 14.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగొలు చేసింది. ఆ తర్వాతి ఏడాదిలో రూ.11 కోట్లకు మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2023, 24 సీజన్‌లలో కూడా అతడికి ఆర్సీబీ రిటైన్ చేసుకుంది.
అయితే ఈ ఏడాది సీజన్ మినహా మిగితా సీజన్లలో మాక్సీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2024లో అయితే మాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కేవలం 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఆర్సీబీ తరపున తన డెబ్యూ సీజన్‌లో మాక్స్‌వెల్ ఏకంగా 513 పరుగులు చేశాడు. కాగా ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఒకవేళ మాక్స్‌వెల్ వేలంలో వస్తే భారీ మొత్తం దక్కడం ఖాయం.
🚨 Glenn Maxwell Unfollowed #RCB on Instagram #IPL2025 #CricketTwitter pic.twitter.com/8EFfex3165
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 29, 2024
Comments
Please login to add a commentAdd a comment