
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో మాక్స్‌వెల్ రెండో సారి డకౌటయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాక్స్‌వెల్ తీవ్ర నిరాశపరిచాడు.
కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్సీ.. చెత్త షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 13 ఓవర్‌లో శ్రేయాస్ గోపాల్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన మాక్స్‌వెల్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగు బంతులు ఎదుర్కొని క
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ. 11 కోట్లు తీసుకుని మరి ఇటువంటి చెత్త ఆడుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అతడిని జట్టు నుంచి పక్కన పెట్టండి మరి కొంతమంది పోస్ట్‌లు చేస్తున్నారు.
చదవండి: IPL 2024: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్
— Sitaraman (@Sitaraman112971) April 11, 2024
Maxwell in every match ....🤣😭😭 pic.twitter.com/uwEBu43buT
— Jo Kar (@i_am_gustakh) April 11, 2024