RCB Vs MI: మాక్స్‌వెల్‌ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే | IPL 2024 RCB Vs MI: Glenn Maxwell Has Equalled An Unwanted Record In IPL, Deets Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs MI: మాక్స్‌వెల్‌ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Published Fri, Apr 12 2024 7:10 AM

Glenn Maxwell has equalled an unwanted record In IPL - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆల్‌రౌం‍డర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ డకౌటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్‌ ఖాతా తెరవకుండానే శ్రేయాస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన మాక్సీ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్‌ కార్తీక్‌, రోహిత్‌ శర్మ సరసన మాక్స్‌వెల్‌ చేరాడు. మాక్స్‌వెల్‌ ఇప్పటివరకు 17 సార్లు ఐపీఎల్‌లో డకౌట్‌లు కాగా.. రోహిత్‌, కార్తీక్‌ 17 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

కాగా ఈ ఏడాది సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచే మాక్స్‌వెల్‌ నిరాశపరుస్తున్నాడు.  ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్‌.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ సాధించాడు. రాబోయో మ్యాచ్‌ల్లో అతడిపై వేటు పడే అవకాశముంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement