RCB Vs MI: వారెవ్వా.. ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! రోహిత్‌ షాక్‌ (వీడియో) | IPL 2024 RCB Vs MI: Reece Topley Grabs A Superman Catch To Dismiss Rohit Sharma, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs MI: వారెవ్వా.. ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! రోహిత్‌ షాక్‌ (వీడియో)

Published Fri, Apr 12 2024 7:00 AM | Last Updated on Fri, Apr 12 2024 10:09 AM

Reece Topley Grabs A Superman Catch, Rohit Sharma Stunn - Sakshi

PC: Cricket Addictor

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్‌ రీస్‌ టాప్లీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. టాప్లీ అద్బుత క్యాచ్‌తో మంచి ఊపు మీద ఉన్న రోహిత్‌ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ వేసిన విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో రెండో బంతిని రోహిత్‌ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్‌ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న టాప్లీ ఎడమవైపు ఫుల్-లెంగ్త్ డైవ్ చేసి అద్భుతమైన సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు.

టాప్లీ క్యాచ్‌తో వాంఖడే స్టేడియం మొత్తం సైలెంట్‌ అయిపోయింది. రోహిత్‌ కూడా ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక 38 పరుగులు చేసిన రోహిత్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌(34 బంతుల్లో 69) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్‌ యాదవ్‌(52), రోహిత్‌ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్‌ జాక్స్‌, విజయ్‌ కుమార్‌, ఆకాష్‌ దీప్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(61), కార్తీక్‌(53) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్పీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement