మరి ఇంత చెత్త బ్యాటింగా.. ఆట మర్చిపోయావా మాక్సీ? వీడియో వైరల్‌ | Glenn Maxwells poor run continues as Nandre Burger castles him with peach | Sakshi
Sakshi News home page

#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా.. ఆట మర్చిపోయావా మాక్సీ? వీడియో వైరల్‌

Published Sat, Apr 6 2024 11:21 PM | Last Updated on Sun, Apr 7 2024 3:51 PM

Glenn Maxwells poor run continues as Nandre Burger castles him with peach - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన మాక్స్‌వెల్‌.. ఇప్పుడు జైపూర్‌ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌లో మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌ తీవ్ర నిరాశపరిచాడు.

3 బంతులు ఎదుర్కొన్న మాక్సీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన మాక్స్‌వెల్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్‌.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు.

కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి మాక్స్‌వెల్‌ ఆట మర్చిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే మరి కొంతమం‍ది దేశం కోసం చెలరేగిపోతాడని.. ఐపీఎల్‌లో మాత్రం తుస్సుమనిపిస్తాడని పోస్ట్‌లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్తాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement