IPL 2024 RR vs RCB Live Updates:
ఆర్సీబీపై రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది.
రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్(100,58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో టాప్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. కానీ తమ జట్టు ఓటమి పాలవ్వడంతో కోహ్లి సెంచరీ వృథాగా మిగిలిపోయింది.
రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. శాంసన్ ఔట్
148 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జోస్ బట్లర్(77), రియాన్ పరాగ్(4) పరుగులతో ఉన్నారు.
జోస్ బట్లర్, సంజూ ఫిప్టీ..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 109/1. క్రీజులో జోస్ బట్లర్(50), సంజూ శాంసన్(58) పరుగులతో ఉన్నారు.
9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 84/1
9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(48), సంజూ శాంసన్(35) పరుగులతో ఉన్నారు.
6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 54/1
6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(39), సంజూ శాంసన్(15) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. జైశ్వాల్ ఔట్
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టాప్లీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఉన్నాడు.
సెంచరీతో చెలరేగిన కోహ్లి.. రాజస్తాన్ టార్గెట్ 184 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది సీజన్‌లో విరాట్‌దే తొలి సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు.
అతడితో పాటు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ ఒక్క వికెట్ సాధించాడు.
సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి..
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో విరాట్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
రెండో వికెట్ డౌన్..
128 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన గ్లెన్ మాక్స్‌వెల్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి 87 పరుగులతో ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
125 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
విరాట్ కోహ్లి ఫిప్టీ..
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 బంతుల్లో కోహ్లి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(40), విరాట్ కోహ్లి(59) పరుగులతో ఉన్నారు.
9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 80/0
9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(34), విరాట్ కోహ్లి(38) పరుగులతో ఉన్నారు.
6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 53/0
6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(14), విరాట్ కోహ్లి(32) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 21/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(5), విరాట్ కోహ్లి(10) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఆర్సీబీ మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌరవ్ దిలీప్‌సింగ్ చౌహాన్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
Comments
Please login to add a commentAdd a comment