అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లీగ్ ప్రారంభానికి ముందు కింగ్స్‌పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. ఎందుకంటే ఆ జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉంది. దీనికి తోడు మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన మ్యాచ్‌లో కింగ్స్ ఓడిపోయినా ఆకట్టుకుంది.ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిచినంత పని చేసిన పంజాబ్ తీరా సూపర్ ఓవర్‌లో రబడ దాటికి మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి భోణీ కొట్టింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. (చదవండి : సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!)
రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. దీంతో ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పంజాబ్ ఆటతీరు మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఇలాగే కొనసాగితే మొదట లీగ్ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలుస్తుంది. అయితే కింగ్స్ పంజాబ్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 1,5,13,11,11*, 7 పరుగులు చూస్తే అసలు మనం చూస్తున్నది మ్యాక్స్‌వెల్ ఆటేనా అనే అనుమానం కలుగుతుంది. గురువారం ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టి గేల్‌ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కింగ్స్ అభిమానులు విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మ్యాక్స్ వెల్ ఆటతీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : రోహిత్ శర్మను గుడ్డిగా నమ్మాను.. అందుకే)
'పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్ నుంచి ఏదో ఆశిస్తుంది. కానీ అతను మాత్రం స్కోర్లు చేయలేక వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కెప్టెన్ రాహుల్‌కు విదేశీ ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందడం లేదు. నికోలస్ పూరన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరు రాణించడం లేదు. అందులో మ్యాక్స్‌వెల్ కూడా ఒకడు. అయితే 10.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్న మ్యాక్స్‌వెల్ నుంచి పంజాబ్ ఆశించడంలో తప్పు లేదు. ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నందుకు పంజాబ్‌కు అతను కీలకం కావచ్చు.. కానీ మ్యాక్స్ విఫలమవుతున్న వేళ పక్కనైనా పెట్టాలి లేదా మరో మ్యాచ్ అవకాశమైనా ఇవ్వాలి. ఒకవేళ మ్యాక్స్‌వెల్ వద్దనుకుంటే గేల్‌కు అవకాశమిచ్చి చూడాలి. గేల్ మెరుస్తాడని కాదు కాని ఒకసారి అవకాశమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ఎవరైతే ఏంటి ఆడకపోతే పక్కన పెట్టాల్సిందే. కింగ్స్ కెప్టెన్‌గా రాహుల్ మ్యాక్స్‌వెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను ఆడించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం చెప్పాడు. ఒకవేళ గేల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే నాకు తెలిసి పంజాబ్ జట్టు అతన్ని మూడు లేదా నాలుగు స్థానాల్లో ఆడించాల్సి ఉంటుంది. మరి పంజాబ్ తలరాత తర్వాతి మ్యాచ్ నుంచైనా మారుతుందేమో చూడాలంటూ తెలిపాడు. కాగా కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(శనివారం) కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం')
Comments
Please login to add a commentAdd a comment