IND Vs AUS: విరాట్‌ కోహ్లి- మ్యాక్స్‌వెల్‌ ఫ్రెండ్లీ ఫైట్‌.. వీడియో వైరల్‌ | ODI World Cup 2023 Final: Virat Kohli And Glenn Maxwell Engaged In Friendly Fight During IND Vs AUS Final Match, Video Goes Viral - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs AUS Final: విరాట్‌ కోహ్లి- మ్యాక్స్‌వెల్‌ ఫ్రెండ్లీ ఫైట్‌.. వీడియో వైరల్‌

Published Sun, Nov 19 2023 5:25 PM | Last Updated on Sun, Nov 19 2023 6:54 PM

Virat Kohli, Glenn Maxwell Engaged In  Friendly Fight - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(13), బుమ్రా(1) ఉన్నారు. అంతకుముందు రాహుల్‌(66), రోహిత్‌ శర్మ(47), విరాట్‌ కోహ్లి(54) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లి- గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే?
భారత ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ వేసిన మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. అయితే బంతి నేరుగా మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మాక్స్‌వెల్‌ చేతికి వెళ్లింది. అయితే మాక్సీ వికెట్‌ కీపర్‌ త్రో వేసే క్రమంలో బంతి మిస్స్‌ అయ్యి విరాట్‌ కోహ్లి పైకి వెళ్లింది. కోహ్లి వెంటనే బంతిని చేతితో పట్టుకున్నాడు. మాక్సీ కూడా కోహ్లి వైపు చూస్తూ సారీ చెప్పాడు.

ఈ క్రమంలో కోహ్లి మాక్సీ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ నవ్వాడు. మాక్సీ కూడా నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా మాక్సీ, కోహ్లి మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. వరల్డ్‌ కప్‌ హిస్టరీలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement