వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో అక్టోబర్ 28న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే.
అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం ఉండడంతో ఆసీస్ ఆటగాళ్లు ధర్మశాలలోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు గోల్ప్ ఆడుతుండగా గాయ పడ్డాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం వెనుక నుండి జారి పడడంతో తలకు గాయమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. దీంతో కంకషన్ ప్రోటోకాల్స్ రూల్స్ ప్రకారం మ్యాక్సీ దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండనున్నాడు.
కాగా మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడని, సెమీఫైనల్స్‌కు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా మ్యాక్సీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ(44 బంతుల్లో 106 పరుగులు) మ్యాక్స్‌వెల్ బాదాడు.
చదవండి: CWC 2023: సూర్యకుమార్ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన అభిమాని
Comments
Please login to add a commentAdd a comment