బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విద్వంసం సృష్టించాడు. బుధవారం హాబర్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో అతడు సెంచరీ సాధించాడు. హరికేన్స్ బౌలర్లను మ్యాక్సీ ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు.
కాగా మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌కు స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్ తోడు అవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్‌బోర్న్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా ఇప్పటి వరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ 154 పరుగులు సాధించగా, స్టోయినిస్ 75 పరుగులుతో రాణించాడు. హరికేన్స్ బౌలర్లలో జోష్ ఖాన్, థాంమ్సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 274 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హరికేన్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది.
చదవండి: షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలకు పాక్ మాజీ కెప్టెన్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment