PC: IPL.com
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితం విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఈ మ్యాచ్‌లో పరుగులు వరద పారింది. రెండు జట్లు కలిపి ఏకంగా 444 పరుగులు నమోదు చేశాయి.
అదే విధంగా ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 33 సిక్స్‌లు బాదడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), దుబే(27 బంతుల్లో 52) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 227 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బెంగళూరు తొలి ఓవర్‌లోనే కోహ్లి వికెట్‌ను కోల్పోయింది.
అనంతరం డుప్లెసిస్, మాక్స్‌వెల్ షో మొదలైంది. వీరిద్దరూ సీఎస్‌కే బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించారు. మాక్స్‌వెల్ 36 బాల్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.
చదవండి: Trolls On Vijaykumar Vyshak: చివరి మ్యాచ్‌లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు..
#Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాక్! ఫైన్ పడింది.. ఎందుకంటే..
2019: #TATAIPL debut for @RCBTweets 🏏
— JioCinema (@JioCinema) April 17, 2023
Now: Chief destructor against them for @ChennaiIPL 💛
Shivam Dube's attack mode was 🔛 with the bat🔥#RCBvCSK #IPLonJioCinema #IPL2023 | @IamShivamDube pic.twitter.com/jTnfAAccOL
Comments
Please login to add a commentAdd a comment