PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని సీఎస్‌కే భావిస్తోంది. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సీఎస్‌కేను తన హోం గ్రౌండ్ చెపాక్‌లో ఓడించే సత్తా ఉన్న ఏకైక జట్టు కోల్‌కతా అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"చెపాక్ పిచ్‌లో సీఎస్‌కే తిరిగిండదని మనకు తెలుసు. కానీ వారి సొంతం మైదానంలో పోటీ ఇచ్చే ఏకైక జట్టు ఒకటి ఉంది. అదే కోల్‌కతా నైట్‌రైడర్స్. కేకేఆర్‌లో సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి కేకేఆర్ కూడా చెపాక్ స్పిన్ పిచ్‌పై రాణించగలదు. ఇక బ్యాటింగ్‌లో రాయ్, గుర్బాజ్ ఇద్దరు ఓవర్సీస్ ఓపెనర్లు ఉన్నారు.
వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా అనుకుల్ రాయ్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చి రాణిస్తున్నాడు. కాబట్టి కోల్‌కతా జట్టును అంత తేలికగా తీసుకోకూడదు" అని జియోసినిమా 'ఆకాశవాణి' షోలో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!
Comments
Please login to add a commentAdd a comment