ముంబై ఇండియన్స్ లక్ష్యం 158
Published Mon, May 12 2014 9:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు 158 పరుగులు లక్ష్యాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.
హైదరాబాద్ జట్టులో ఫించ్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 7 ఫోర్లతో 68, వార్నర్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 55, ధావన్ 11, రాహుల్ 10 పరుగులు చేశారు. మలింగాకు రెండు వికెట్లు దక్కాయి.
Advertisement
Advertisement