ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అదరగొట్టారు.
డూ ఆర్ డై లా జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.
స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
Comments
Please login to add a commentAdd a comment