ముంబై ఇండియన్స్ సలహాదారుడిగా రికీ పాంటింగ్!
దుబాయ్: ఐపీఎల్ టోర్నిలో ముంబై ఇండియన్స్ జట్టుకు సలహాదారుడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యారు. యూఏఈలో జరిగే చివరి రెండు మ్యాచ్ లకు రికీ పాంటింగ్ అందుబాటులోకి వస్తారని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో పాంటింగ్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్ జట్టుతో పనిచేయడం తనకు చాలా సంతోషకరం. ముంబై ఇండియన్ జట్టులో సభ్యుడిగా తాను ఐపీఎల్ టోర్నిని ఎంజాయ్ చేశాను. ముంబై ఇండియన్ జట్టును అగ్రస్థానంలో నిలుపడానికి కృషి చేస్తాను అని పాంటింగ్ తెలిపారు.