ముంబై ఇండియన్స్ 'ఐకాన్'గా సచిన్ టెండూల్కర్
ముంబై ఇండియన్స్ 'ఐకాన్'గా సచిన్ టెండూల్కర్
Published Wed, Apr 9 2014 7:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్ జట్టు ఐకాన్ గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను ప్రకటించారు. ముంబై జట్టులో సచిన్ భాగస్వామిగా ఉంటారు. జట్టుకు స్పూర్తిగా నిలుస్తారు. సచిన్ అందించిన సేవలకు గుర్తుగా ఐపీఎల్ గత సీజన్ ను, చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 ట్రోఫిని అంకితమిచ్చామని జట్టు యజమాని నీతా అంబానీ తెలిపారు.
జట్టుకు విలువైన సేవలందించిన సచిన్ ను ముంబై ఇండియన్ ఐకాన్ గా చేయడం తమకు సంతోషంగా ఉందని నీతా అంబానీ అన్నారు. ముంబై ఇండియన్స్ జట్టుతో అనుబంధాన్ని కొనసాగించడం తనకు ఆనందం కలిగిస్తోందని సచిన్ అన్నారు.
ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ జట్టుతో అనుబంధం ఉందని.. ఆ అనుభంధాన్ని కొనసాగిస్తానని సిచన్ తెలిపారు. రెండు సార్లు చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 విజేతగా, ఐపీఎల్ లో ఓసారి రన్నరప్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది.
Advertisement
Advertisement