అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు తరలివస్తున్న స్టార్‌ క్రికెటర్లు | Star Cricketers Leave For Jamnagar To Attend Anant Ambani And Radhika Merchant Pre Wedding Function | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు తరలివస్తున్న స్టార్‌ క్రికెటర్లు

Published Fri, Mar 1 2024 4:25 PM | Last Updated on Fri, Mar 1 2024 5:15 PM

Star Cricketers Leave For Jamnagar To Attend Anant Ambani And Radhika Merchant Pre Wedding Function - Sakshi

వ్యాపార దిగ్గజం, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రెండవ కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ ఈవెంట్‌కు అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. ఇవాల్టి నుంచి (మార్చి 1) మూడు రోజుల పాటు జరిగే ఈ ముందస్తు పెళ్లి వేడకల్లో సినీ, క్రీడారంగాలకు చెందిన స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిలో మరి ముఖ్యంగా క్రికెటర్లు హైలైట్‌ కానున్నారు.

అంబానీ గ్రూప్‌ అధినేతకు క్రికెట్‌ సంబంధిత వ్యాపారాల్లో నేరుగా పెట్టుబడులు ఉండటంతో దేశ విదేశాలకు చెందిన స్టార్‌ క్రికెటర్లు ఈ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, స్టార్‌ క్రికెటర్ ఎంఎస్‌ ధోని సతీసమేతంగా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

ప్రస్తుత టీమిండియా సభ్యులు రోహిత్‌ శర్మ, పాండ్యా బ్రదర్స్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ వేడుకల్లో పాల్గొనేందుకు స్వస్థలాల నుంచి బయల్దేరారు. మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌, విదేశీ ఆటగాళ్లు డ్వేన్‌ బ్రేవో, ట్రెంట్‌ బౌల్ట్‌, సామ్‌ కర్రన్‌, రషీద్‌ ఖాన్‌, పూరన్‌ ఇదివరకే వేడుక జరుగనున్న జామ్‌ నగర్‌కు చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు 1000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement