
కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి
ఐపీఎల్7 లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి క్వాలిఫైర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా జట్టు 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.
ఉతప్ప 42, పాండే 21, షాకీబ్ హసన్ 18, యూసఫ్ పఠాన్ 20 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య కుమార్ 5 పరుగులతోనూ, టెన్ డస్కోటే పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు.
వాస్తవానికి మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా బుధవారం రిజర్వు డే కు షిఫ్ట్ చేశారు.