యువరాజ్ వీరవిహారం, ఢిల్లీ టార్గెట్ 187
డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. యువరాజ్ ధాటిగా ఆడి 29 బంతుల్లో 68 పరుగులు చేయడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ముందు 187 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు నిర్ధేశించింది.
ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు జట్టు 14.2 ఓవర్లలో 107 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే చివర్లో యువరాజ్ బ్యాటింగ్ మెరుపులతో భారీ స్కోరును నమోదు చేసుకుంది.
క్రిస్ గేల్ 22, పార్థీవ్ పటేల్ 29, కోహ్లీ 10, ఏబీ డివిల్లీయర్స్ 33 పరుగులు చేసి అవుటవ్వగా.. యువరాజ్ (29 బంతుల్లో 9 సిక్సర్లు, 1 ఫోర్) 68, రాణా 15 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. షమీ, కౌల్, శుక్లాలకు చెరో వికెట్ లభించింది.