విజయంతో ముగించారు | Royal Challengers Bangalore beat Delhi Daredevils | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించారు

Published Mon, May 15 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

విజయంతో ముగించారు

విజయంతో ముగించారు

. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన బెంగళూరు
∙ కోహ్లి అర్ధ సెంచరీ  


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ పదో సీజన్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఊరట విజయంతో ముగించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన 10 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తమ చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో బెంగళూరుకిదే తొలి విజయం కావడం విశేషం. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు హర్షల్‌ పటేల్‌కి దక్కింది. అంతకుముందు టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి (45 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... క్రిస్‌ గేల్‌ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.

వీరిద్దరి భాగస్వామ్యంలో రెండో వికెట్‌కు 66 పరుగులు జత చేరాయి. అయితే వీరి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో నేగి (5 బంతుల్లో 13 నాటౌట్‌; 3 ఫోర్లు) వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఓ మాదిరి స్కోరైనా చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో బంతికే వికెట్‌ పడినా శ్రేయస్‌ అయ్యర్‌ (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కరుణ్‌ నాయర్‌ (22 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో సరైన భాగస్వామ్యాలు ఏర్పడలేదు. రిషభ్‌ పంత్‌ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం 17వ ఓవర్‌లో ముగియగా ఆఖర్లో షమీ (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగినా ఫలితం లేకపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement