సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరిగింది. ముంబై కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పటకీ.. ముంబై ఆటగాళ్లు గట్టిగా పోరాడటంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది.
సన్‌రైజర్స్ బౌలర్ ఒట్నీల్ (4-0-35-3) బార్ట్‌మన్ చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి ముంబై గెలుపును అడ్డుకున్నాడు. ముంబై చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒట్నీల్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్‌ను గెలిపించాడు.
బ్యాటింగ్‌లో ఓపెనర్ జోర్డన్ హెర్మన్ (62 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో చెలరేగడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ (37 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో పోలార్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఛేదనకు దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమతమై స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. వాన్ డర్ డస్సెన్ (41), ర్యాన్ రికెల్టన్ (58), సామ్ కర్రన్ (37 నాటౌట్), కీరన్ పోలార్డ్ (24) ముంబైను గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. ఒట్నీల్ బార్ట్‌మన్ (3/35) ముంబైని దెబ్బకొట్టాడు. డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment