కావ్య మారన్(PC: Twitter)- ట్రిస్టన్ స్టబ్స్ (PC: Sunrisers Eastern Cape)
SA20 auction- Tristan Stubbs Most Expensive Player: టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా దక్షిణాఫ్రికాలోనూ సౌతాఫ్రికా టీ20 లీగ్ పేరిట వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఆటగాళ్ల వేలం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ యజమాని కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌గా నామకరణం చేసిన యాజమాన్యం.. నిబంధనల ప్రకారం వేలానికి ముందే ఇద్దరు ప్రొటిస్ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది.
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎయిడెన్ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల స్పెషలిస్టు ఒట్‌నీల్ బార్టమన్(అన్‌క్యాప్డ్)ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన సోమవారం నాటి వేలంలో దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ కోసం సన్‌రైజర్స్.. ఎంఐ కేప్‌టౌన్(ముంబై ఇండియన్స్) యాజమాన్యంతో తీవ్రంగా పోటీ పడింది.
అత్యధిక ధర! ఎట్టకేలకు సొంతం
ఎట్టకేలకు 9.2 మిలియన్ సౌతాఫ్రికా ర్యాండ్‌లు(భారత కరెన్సీలో సుమారు 4.1 కోట్లు) వెచ్చించి ట్రిస్టన్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ యువ వికెట్ కీపర్ తమ జట్టు సొంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించగానే కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
చిరునవ్వులు చిందిస్తూ ఆమె మురిసిపోయిన తీరు అభిమానులకు ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా 22 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు.
ఇక ట్రిస్టన్ స్టబ్స్ ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ పేసర్ టైమల్ మిల్స్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, సౌతాఫ్రికా లీగ్‌లో భాగంగా అతడు సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్‌నకు ప్రాతినిథ్యం వహించనుండటం విశేషం.
ఈ విషయంపై ట్రిస్టన్ స్టబ్స్ స్పందిస్తూ.. ‘క్రేజీగా అనిపిస్తోంది. పోర్ట్ ఎలిజబెత్‌లోనే నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇప్పుడు ఆ జట్టుకు ఆడనుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
చదవండి: IND Vs AUS T20 Series: టీమిండియాకు ఆరో బౌలర్ దొరికేశాడు.. ఎవరంటే?!
టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం..
Teams battle in auction to get the services of 22 year old Tristan Stubbs.#TristanStubbs#SA20Auction#SA20 #INDvAUS pic.twitter.com/NAF4dTxd5N
— Cricket Videos🏏 (@Crickket__Video) September 19, 2022
The 22-year old Tristan Stubbs expresses his joy after being picked up by #SEC in the #SA20Auction! 🧡
— Sunrisers Eastern Cape (@SunrisersEC) September 19, 2022
#SunrisersEasternCape #OrangeArmy #TristanStubbs pic.twitter.com/9Ij4rDiPe0
Comments
Please login to add a commentAdd a comment