SA20 2023: SEC Kaviya Maran Gets Marriage Proposal In South Africa Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్‌.. వీడియో వైరల్‌

Published Fri, Jan 20 2023 9:17 AM | Last Updated on Fri, Jan 20 2023 12:06 PM

SA20 2023: SEC Kaviya Maran Gets Marriage Proposal Video Viral - Sakshi

SA20, 2023 - Sunrisers Eastern Cape- Kavya Maran: కావ్యా మారన్‌... ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్‌ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లలో సందడి చేస్తూ ఫేమస్‌ అయింది ఈ చెన్నై బ్యూటీ.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సంబంధించిన ఈవెంట్‌ ఏదైనా సరే కావ్య అక్కడ ఉందంటే సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌ అవ్వా‍ల్సిందే! నెటిజన్లలో ఆమెకున్న క్రేజ్‌ అలాంటిది మరి!

ఇక తాజాగా కావ్య పేరు మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం... సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ పేరిట టీమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో సన్‌రైజర్స్‌ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది.

పెళ్లి ప్రపోజల్‌
ఇందులో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఫ్రాంఛైజీ పర్ల్‌ రాయల్స్‌తో తలపడింది. పర్ల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్‌ చేయడం విశేషం.

నన్ను పెళ్లి చేసుకుంటావా?
‘‘కావ్యా మారన్‌.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ హార్ట్‌ సింబల్‌ జత చేసిన ప్లకార్డును పట్టుకుని తన మనసులోని కావ్యతో పాటు అక్కడున్న వాళ్లందరి ముందు బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

సౌతాఫ్రికాలో కూడా డామినేషన్‌
ఇక ఈ వీడియోపై స్పందించిన సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎంత ధైర్యం? మా మేడమ్‌కే లైన్‌ వేస్తావా? ఆమెకు దూరంగా ఉండు... లేదంటే నీ సంగతి చూస్తాం! ఏదేమైనా సౌతాఫ్రికాలో కూడా మీ డామినేషన్‌ సూపర్‌ మేడమ్‌’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

‘‘మేడమ్‌ సార్‌.. మేడమ్‌ అంతే’’ అంటూ రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా సన్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు, మీడియా మొఘల్స్‌లో ఒకరైన కళానిధి మారన్‌ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్‌ జట్ల సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య.. సన్‌ టీవీ మ్యూజిక్‌, ఎఫ్‌ఎం చానెల్స్‌ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement