Kaviya Maran
-
Kaviya Maran: వేలకోట్లకు ఏకైక వారసురాలు.. కావ్యా మారన్ గురించి ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
SRH పై వార్నర్ పాజిటివ్ ట్వీట్..కావ్య మారన్ పై ఫ్యాన్స్ ఫైర్
-
దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ
SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ నెల 10న పర్ల్ రాయల్స్- ఎంఐ కేప్‌టౌన్‌తో మ్యాచ్‌తో ప్రొటిస్ పొట్టి లీగ్‌కు తెరలేచింది. ఈ క్రమంలో జనవరి 12న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ క్యాపిటల్స్ చేతిలోనే 37 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎయిడెన్ మార్కరమ్ బృందం ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. పర్ల్తో మ్యాచ్‌లో అయితే, ఎంఐ కేప్‌టౌన్‌ను వరుసగా 4 వికెట్లు, 2 వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్.. గురువారం నాటి మ్యాచ్‌లో పర్ల్ రాయల్స్‌ను మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పర్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతితో రాణించడం విశేషం. 3 ఓవర్లు బౌలింగ్ వేసి అతడు 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. సమిష్టి కృషితో.. ఇతర బౌలర్లలో మగల ఒక వికెట్ తీయగా.. వాన్ డెర్ మెర్వె, బ్రైడన్ కార్సే రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్స్ ఆడం రాసింగ్టన్ 20 రన్స్ స్కోరు చేయగా, జోర్డాన్ హెర్మన్ 43 పరుగులతో రాణించాడు. ఫ్యాన్స్ ఖుషీ ఇక కెప్టెన్ మార్కరమ్ 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 18 పరుగులు, మార్కో జాన్సెన్ 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పర్ల్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మార్కరమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ హైలైట్‌గా నిలిచారు. కాగా సన్‌రైజర్స్ వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రైజర్స్ ఐపీఎల్-2023లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. చదవండి: Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్ క్వార్టర్స్ అవకాశాలు?! కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ Top scorer in his first #SA20 game! 👊 Jordan Hermann shares his thoughts on his performance & our win in Paarl! 🗣️#SEC #SunrisersEasternCape #PRvSEC #SA20 #PlayWithFire pic.twitter.com/u8HQNKIu2Q — Sunrisers Eastern Cape (@SunrisersEC) January 19, 2023 -
మా మేడమ్‌కే లైన్ వేస్తావా?.. కావ్య మారన్‌కు పెళ్లి ప్రపోజల్.. వైరల్
SA20, 2023 - Sunrisers Eastern Cape- Kavya Maran: కావ్యా మారన్... ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లలో సందడి చేస్తూ ఫేమస్ అయింది ఈ చెన్నై బ్యూటీ. క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన ఈవెంట్ ఏదైనా సరే కావ్య అక్కడ ఉందంటే సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే! నెటిజన్లలో ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి! ఇక తాజాగా కావ్య పేరు మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం... సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట టీమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. పెళ్లి ప్రపోజల్ ఇందులో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో తలపడింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్ చేయడం విశేషం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ‘‘కావ్యా మారన్.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్లకార్డును పట్టుకుని తన మనసులోని కావ్యతో పాటు అక్కడున్న వాళ్లందరి ముందు బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. సౌతాఫ్రికాలో కూడా డామినేషన్ ఇక ఈ వీడియోపై స్పందించిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎంత ధైర్యం? మా మేడమ్‌కే లైన్ వేస్తావా? ఆమెకు దూరంగా ఉండు... లేదంటే నీ సంగతి చూస్తాం! ఏదేమైనా సౌతాఫ్రికాలో కూడా మీ డామినేషన్ సూపర్ మేడమ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘మేడమ్ సార్.. మేడమ్ అంతే’’ అంటూ రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా సన్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, మీడియా మొఘల్స్‌లో ఒకరైన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ జట్ల సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య.. సన్ టీవీ మ్యూజిక్, ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. Looks like someone needs a bit of help from @Codi_Yusuf on how to propose in the BOLAND. 💍#Betway #SA20 | @Betway_India pic.twitter.com/ZntTIImfau — Betway SA20 (@SA20_League) January 19, 2023 -
కావ్యా మారన్.. ఆ నవ్వు ఇక ఆగేదే లే!
కావ్యా మారన్.. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి ఈ పేరు సుపరిచితం. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని.. సన్ పిక్సర్స్ అధినేత కళానిధి మారన్ కూతురే ఈ కావ్యా మారన్. ఐపీఎల్ 2021 సీజన్ వరకు ఈమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. అయితే గత సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓడిన ప్రతీసారి జట్టు కంటే కావ్యా మారన్ ఎక్కువగా హైలైట్ అయ్యేది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు క్రమం తప్పకుండా హాజరై ఉత్సాహపరిచేది. మధ్యలో ఒకటి రెండు గెలుపులు తప్ప ఎస్ఆర్హెచ్కు ఓటములే ఎక్కువగా ఎదురవ్వడంతో కావ్యా మారన్‌కు బాధే ఎక్కువగా మిగిలింది. ఆమె నవ్వితే చూడాలని ఉందంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ చేశారు. గత సీజన్లో ఒకటి రెండుసార్లు మాత్రమే నవ్విన కావ్యా మారన్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం తన నవ్వును కొనసాగిస్తూనే ఉంది. అందుకు ఎస్ఆర్హెచ్ వరుస విజయాలే కారణం. ఐపీఎల్ 2022లో ప్రారంభంలో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో కావ్యా మారన్‌కు ఈసారి కూడా నవ్వకుండానే సీజన్ ముగిస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ వారి అంచనాలు తప్పుతున్నాయి. గోడకు కొట్టిన బంతిలా ఎస్ఆర్హెచ్ ఫుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. ఎవరు ఊహించని రీతిలో ఆడుతున్న ఎస్ఆర్హెచ్.. ఇదే జోరు కనబరిస్తే మరోసారి కప్ ఎగురేసుకుపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే ఇదే ఎస్ఆర్హెచ్ను గత ఫిబ్రవరిలో మెగావేలం ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఎంపికపై అంతా విమర్శించారు. కావ్యా మారన్ సహా మిగతా అధికారులను ట్రోల్ చేస్తూ మీమ్సీ, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: Umran Malik: ఐపీఎల్లో ముగ్గురికి మాత్రమే సాధ్యమైంది.. తాజాగా ఉమ్రాన్ మాలిక్ Liam Livongstone: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు -
ఏం ఆడుతున్నార్రా బాబూ.. అంతా మీరే చేశారు.. ఇక ఇంతే!
IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్ మెగా వేలం మొదలు సీజన్ ఆరంభమైనప్పటి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతూనే ఉంది. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఏకంగా 61 పరుగుల తేడాతో ఓటమి.. కోట్లు పోసి ఏరికోరి కొన్న వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ ఆ మ్యాచ్‌లో డకౌట్. ఎయిడెన్ మార్కరమ్, వాషింగ్టన్ సుందర్ తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో.. "ఎవరైనా గెలిచేందుకు సమష్టిగా పోరాడతారు.. కానీ మన వాళ్లు ఓటమిని మూటగట్టుకోవడంలో తమ వంతు పాత్ర పోషించడంలో పోటీ పడతారు" అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుర్రుమన్నారు. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ జరిగిన తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఆరంభంలో ఆశలు రేపినా చివర్లో పరాజయం పాలై మాకిది షరా మామూలే అని నిరూపించారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా 12 పరుగుల తేడాతో సీజన్లో తమ రెండో మ్యాచ్ లోనూ ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా జట్టు సీఈఓ కావ్యా మారన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. "మొత్తం మీరే చేశారు. ఒక్క సీజన్లో విఫలమైందుకు డేవిడ్ వార్నర్ భాయ్ ను అవమానకర రీతిలో బయటకు పంపించారు. రషీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోలేదు. బెయిర్ స్టోను వదిలేశారు. జట్టును నాశనం పట్టించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్ సందర్భంగా కావ్య హావభావాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ""ఈ సీజన్ మొత్తం మీ ఎక్స్ ప్రెషన్స్ ఇలాగే ఉండబోతున్నాయి. రాసి పెట్టుకోండి. హిట్టర్లు లేరు. ఎస్ఆర్ హెచ్ లో ఈ ఆటగాడిపై మనం ఆధారపడగలం అని నమ్మకంగా ఒక్క పేరు కూడా చెప్పలేం. ఏం ఆడుతున్నార్రా బాబూ.. సన్ రైజర్స్ కు గడ్డు పరిస్థితులు తప్పవు" అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Aakash Chopra-Chahal: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్..! #SRHvsLSG kavya Maran 💔 Srh fans In first innings in 2nd innings pic.twitter.com/197UXlNAUe — 👑🔔 (@superking1814) April 4, 2022 Whenever @SunRisers struggle to win the matches, I miss these guys 🤧#OrangeArmy #SRHvsLSG @IPL pic.twitter.com/1PNLWg5fke — Foresay sports தமிழ் (@ForesayThamizh) April 4, 2022 Future prediction. #Kavya's expression will be this for the whole season. Mark my words. #SRH is below par in all categories. No hitters, no dependable players. Looks like this will be "the end" of good time of #SunrisersHyderabad #SRHvsLSG pic.twitter.com/mfCZHz9x5W — Avis Indian☮️ (@ClanofGriffin) April 4, 2022 The Main Problem with SRH is there Team Management.. After Just One Year Failure they Drop David Warner... They Not Pick best Bowler Rashid Khan They pick N Pooran at 11 Cr Not J bairstow.. #SRHvsLSG pic.twitter.com/cxxrEGU0Tf — Vaibhav D (@Vaibhav04563161) April 4, 2022 Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs 👏👏 Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe — IndianPremierLeague (@IPL) April 4, 2022 -
IPL 2022 Auction: వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి కళ్లు తన మీదే.. అసలు ఎవరామె?
IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలం ముగిసినా సోషల్ మీడియాలో ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడు పోయాడు? ఏ ఫ్రాంఛైజీది సరైన ఎంపిక? ఎవరు అనవసరంగా డబ్బు ఖర్చు చేశారు? తదితర అంశాల గురించి ఐపీఎల్ ప్రేమికులు చర్చిస్తూనే ఉన్నారు. ఆటగాళ్ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే... తన ఆకర్షణీయ రూపం, అందమైన నవ్వుకు తోడు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఓ యువతి వేలంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు. ఆమె మరెవరో కాదు... సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన హావభావాలతో ఎన్నో సార్లు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచారు ఆమె. 2018 వేలం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కావ్య పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం-2022లో కూడా 30 ఏళ్ల కావ్య మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. చాలా మంది నెటిజన్లు ఆమె గురించి సెర్చ్ చేశారు. అసలు ఎవరీ కావ్య మారన్? మీడియా మొఘల్‌గా పేరొందిన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు చూస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కళానిధి మారన్ బంధువన్న విషయం తెలిసిందే. ఇక ఆయన సోదరుడు దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన కావ్య... ఎస్ఆర్హెచ్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవడం విశేషం. ఇక ఎస్ఆర్హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి ఆమె ఐపీఎల్ మెగా వేలం-2022లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఆక్షన్‌లో హైదరాబాద్ అత్యధికంగా 10.75 కోట్లు వెచ్చించి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను సొంతం చేసుకుంది. చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ? IPL 2022 Mega Auction: ఆరెంజ్ ఆర్మీ ఇదే..