Courtesy: IPL Twitter
కావ్యా మారన్.. ఐపీఎల్ ఫాలో అయ్యేవారికి ఈ పేరు సుపరిచితం. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని.. సన్ పిక్సర్స్ అధినేత కళానిధి మారన్ కూతురే ఈ కావ్యా మారన్. ఐపీఎల్ 2021 సీజన్ వరకు ఈమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. అయితే గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిన ప్రతీసారి జట్టు కంటే కావ్యా మారన్ ఎక్కువగా హైలైట్ అయ్యేది.
ఎందుకంటే ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు క్రమం తప్పకుండా హాజరై ఉత్సాహపరిచేది. మధ్యలో ఒకటి రెండు గెలుపులు తప్ప ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటములే ఎక్కువగా ఎదురవ్వడంతో కావ్యా మారన్‌కు బాధే ఎక్కువగా మిగిలింది. ఆమె నవ్వితే చూడాలని ఉందంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ చేశారు. గత సీజన్‌లో ఒకటి రెండుసార్లు మాత్రమే నవ్విన కావ్యా మారన్.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం తన నవ్వును కొనసాగిస్తూనే ఉంది. అందుకు ఎస్‌ఆర్‌హెచ్ వరుస విజయాలే కారణం.
ఐపీఎల్ 2022లో ప్రారంభంలో ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో కావ్యా మారన్‌కు ఈసారి కూడా నవ్వకుండానే సీజన్ ముగిస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ వారి అంచనాలు తప్పుతున్నాయి. గోడకు కొట్టిన బంతిలా ఎస్‌ఆర్‌హెచ్ ఫుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. ఎవరు ఊహించని రీతిలో ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్.. ఇదే జోరు కనబరిస్తే మరోసారి కప్ ఎగురేసుకుపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌ను గత ఫిబ్రవరిలో మెగావేలం ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఎంపికపై అంతా విమర్శించారు. కావ్యా మారన్ సహా మిగతా అధికారులను ట్రోల్ చేస్తూ మీమ్సీ, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.
చదవండి: Umran Malik: ఐపీఎల్‌లో ముగ్గురికి మాత్రమే సాధ్యమైంది.. తాజాగా ఉమ్రాన్ మాలిక్
Liam Livongstone: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు
Comments
Please login to add a commentAdd a comment