
Courtesy: IPL Twitter
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఫీట్ సాధించాడు. తొలుత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా.. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌ను ఉమ్రాన్ మాలిక్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌ను మెయిడెన్ వేసిన ఉమ్రాన్ రనౌట్ సహా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఉమ్రాన్ మాలిక్ (4-1-28-4) తన కెరీర్‌లో బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఉమ్రాన్ ఒక అరుదైన రికార్డు సాధించాడు.
ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ను (20వ ఓవర్)మెయిడెన్‌గా వేసిన నాలుగో బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ నిలిచాడు. ఇంతకముందు ఇర్ఫాన్ పఠాన్(2008లో ముంబై ఇండియన్స్‌పై), లసిత్ మలింగ(2009లో డెక్కన్ చార్జర్స్‌పై), జై దేవ్ ఉనాద్కట్(2017లో ఎస్‌ఆర్‌హెచ్‌పై) ఇలాంటి ఫీట్ సాధించారు.
చదవండి: Liam Livongstone: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు
Please give him a blue jersey already. #UmranMalik pic.twitter.com/Yc5myHCvWx
— Syed (@aamirsspk) April 17, 2022